BDK: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు మండలానికి చెందిన వీరాంజనేయులుకు ఎల్ ఓ సి పత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.