ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి పారుదల EE కార్యాలయం, పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ ఆఫీసుల్లో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని సూచించారు. చెరువులు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలన్నారు.