GNTR: తుళ్లూరు ట్రాఫిక్ సీఐ-2 గా కాంతి కిరణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో తుళ్లూరు, మంగళగిరి, స్పెషల్ బ్రాంచ్లలో ఎస్సైలుగా పనిచేసిన ఆయన, తాజాగా ప్రమోషన్ పొంది ఇక్కడ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలోని హైకోర్టు, సచివాలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.