BPT: చందోలు పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా కే.మాధవరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. మహిళల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అసాంఘిక పనులపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా చెప్పాలని ఎస్సై సూచించారు.