PPM: పాలకొండ గ్రంథాలయంలో వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు సంస్కృత అవగాహన తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు బౌరోతు శంకరరావు, సంస్కృతం అన్ని భాషలకు తల్లివంటిదని వివరించారు. పిల్లలచే సంస్కృత గీతాలు, పదాలు, సంఖ్యలు చెప్పించారు. రేపు ‘స్వచ్ఛభారత్’ అంశంపై డ్రాయింగ్ పోటీ ఉంటుందని గ్రంథాలయాధికారి గణేష్ తెలిపారు.