TG: ప్రతి వ్యక్తి తాను పుట్టినగడ్డ చరిత్ర తెలుసుకోవాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రతి కథలో నాయకుడు, ప్రతి నాయకుడు ఉంటారని, తెలంగాణ కథలోనూ శకుని, మారీచుడు వంటి పాత్రలు ఉన్నాయన్నారు. 1952లో ముల్కీ ఉద్యమం జరిగిందని, ఆనాడు బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కాంగ్రెస్ కలిపిందన్నారు. ఆంధ్ర, తెలంగాణను కలిపేసిన తర్వాత కొన్నాళ్లకే మళ్లీ ఉద్యమం మొదలైందన్నారు.