HNK: పరకాలలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్ (35) మంగళవారం రాత్రి ఫోన్ కాల్ వచ్చిన అనంతరం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం లభ్యమైంది. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, కాల్ డేటా, సీసీటీవీ ఆధారాలతో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.