AP: రాజధాని నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వంతెనల నిర్మాణం పూర్తయితే పనులు సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను పరిశీలించినట్లు చెప్పారు. వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా పనులు చేయాలని ఆదేశించారు. వంతెనల కిందిభాగంలో మట్టి పూడికతీతలు త్వరగా తొలగించాలన్నారు.