AP: రాజధాని అమరావతిలో మొత్తం 34,563 మందికి ప్లాట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. మరో 494 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు. 163 ఎకరాలకు కోర్టు కేసులు ఉన్నాయని.. అవి పరిష్కారమైన తర్వాత వాళ్లకు కూడా ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల మధ్య ఉన్న సమస్యలతోనే పెండింగ్ ఉన్నాయే తప్ప మరోకటి కాదని చెప్పారు.