విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం జగదాంబ జోన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ సీనియర్ నాయకుడు వై.రాజు మాట్లాడుతూ…32 మంది బలిదానాలు, 67 గ్రామాల త్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వమని స్పష్టం చేశారు.