ASR: జీ.మాడుగులలో బుధవారం జరిగిన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల జిల్లా యూనియన్ సమావేశంలో అధ్యక్షుడు కె.రామారావు మాట్లాడుతూ.. వృత్తి నిపుణులందరూ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. కొత్తగా సభ్యత్వం పొందిన వారికి కార్డులను అందజేశారు. వృత్తిపరమైన గుర్తింపు కోసం ప్రతిఒక్కరూ సంఘంలో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.