నారాయణపేట జిల్లా ఆర్టీవో కార్యాలయానికి ప్రభుత్వం 4 పోస్టులను మంజూరు చేసింది. ఇప్పటివరకు డిప్యుటేషన్‌పై కొనసాగిన పాలనకు ముగింపు పలుకుతూ తాజా బదిలీల్లో ఇద్దరు ఎంవీఐలు, ఇద్దరు అసిస్టెంట్ ఎంవీఐలను కేటాయించారు. హైదరాబాద్ జేటీసీ, ఇబ్రహీంపట్నం నుంచి ఎంవీఐలు, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి నుంచి అసిస్టెంట్ ఎంవీఐలు బదిలీపై వస్తున్నారు.