PPM: పాచిపెంట మండల విద్యా శాఖ అధికారిగా కేవీ సత్యనారయణ నియమితులయ్యారు. ఈ మేరకు పాచిపెంట విద్యా శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. కాగా పాచిపెంట ఏంఈవో1 గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకు ఏంఈవో2 సతీష్ కుమార్, తదితరులు అభినందనలు తెలిపారు.