VZM: ఎల్.కోట మండలం రెల్లీ గవీరమ్మ పేట (ఆర్జీ పేట) పరిధిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శగొట్టిపాటి రవికుమార్‌ను కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలసిన ఎమ్మెల్యే దంపతులు వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు.