BPT: కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద నామ్ (NAM) హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో అనిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని మొదట అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి కాస్త సీరియస్గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిఫర్ చేశారు.