AP: విశాఖ ఆనందపురం మండలం లొడగలవానిపాలెం హైవేపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు.