SKLM: సోంపేట చిన్నపల్లివీధికి చెందిన తెలుకల యుగంధర్ (28) అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహిని తెలిపారు.