ADB: నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు సదరం శిబిరాలను నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని మొబైల్కు సమాచారం వచ్చిన దివ్యాంగులు ఆయా తేదీలలో నిర్వహించే సదరం శిబిరానికి తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.