KRNL: తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో నేడు కర్నూలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జిల్లాలో పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, రైతులు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన సూచించారు.