కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారాన్ని అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం తీసుకున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి, కళాశాల అభ్యున్నతికి అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది.