AP: ప్రముఖ సింగర్ ఆశాభోస్లే మృతిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆశాభోస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి. ఆశా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు. కాగా, సింగర్ ఆశాభోస్లే (92) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.