TG: కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. కొత్త పథకాలు లేవని.. ఉన్నవి కూడా బంద్ చేశారని చెప్పారు. సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు.