AKP: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని నర్సీపట్నం అగ్నిమాపక శాఖాధికారి పీ. అప్పలస్వామి ఆదివారం తెలిపారు. మొదటి రోజు చనిపోయిన అమరవీరులకు నివాళి అర్పిస్తామన్నారు. మరుసటి రోజు నుంచి బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు, అపార్టుమెంట్లు, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంక్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.