AP: ప్రపంచస్థాయి కేంద్రంగా అమరావతి క్యాంటం వ్యాలీ మారుతుందని మంత్రి లోకేష్ అన్నారు. విజన్ నుంచి క్యూబిట్స్ వరకు దేశ క్యాంటం భవిష్యత్తును ఏపీ నిర్మిస్తోందని పేర్కొన్నారు. స్వదేశీ, ఓపెన్ యాక్సెస్ క్యాంటం కంప్యూటర్లను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఎల్లుండి ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా క్వాంటం వ్యాలీ ప్రారంభం ఉంటుందని లోకేష్ వెల్లడించారు.