NLG: ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ బీ. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని మేయర్ చైతన్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.