IPL చరిత్రలో SRH, PBKS జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో గెలిచి హైదరాబాద్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పంజాబ్ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక మ్యాచ్‌లోనూ SRH గెలిచింది. అయితే, ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి ఎరగకుండా దూసుకుపోతున్న PBKSను SRH ఎంతవరకు అడ్డుకుంటుందో చూడాలి.