TG: మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆరోపించారు. బ్యాంకులు పంపిన వివరాల ప్రకారం అందరికీ రుణమాఫీ చేశామని, 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా జమ చేశామని తెలిపారు. రెండు పంటల కాలంలోనే రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని వెల్లడించారు.