దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న విభిన్నమైన యాక్షన్ డ్రామా ‘రేజర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను ఆఖరి దశలో జరుపుకుంటోంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ఖరారు చేస్తూ, ఈ సమ్మర్ కానుకగా మే 8న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.