కామన్వెల్త్ క్రీడలకు భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టు అర్హత సాధించింది. 3×3 మహిళల వీల్‌ఛైర్ విభాగంలో ఆసియా/ఓసియానియా క్వాలిఫయర్స్‌లో భారత్ చోటు దక్కించుకుంది. మరోవైపు భారత పురుషుల జట్టు నాలుగో స్థానానికే పరిమితమైంది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా, మలేసియా జట్లు అర్హత సాధించాయి.