MDK: మండే ఎండలకు చిరు వ్యాపారులు అల్లాడుతున్నారు. పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో జామకాయలు, తాటి ముంజలు విక్రయించే వారు నీడ లేక గొడుగులే ఆసరాగా వ్యాపారం చేస్తున్నారు. పొట్టకూటి కోసం నిప్పుల కొలిమిలో తపిస్తూ వారు సాగిస్తున్న జీవన పోరాటం అందరినీ కలిచివేస్తోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.