TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఐలాపురం ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ అనే వ్యక్తి ఫాంహౌస్ నిర్మించుకున్నాడని.. 2006లో నిర్మించిన ఫాంహౌస్‌ను ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని చెప్పారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నాడని వెల్లడించారు.