TG: రేవంత్ రెడ్డి అరాచక పాలన అంతం చేయడానికి కొత్తతరం రావాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని.. మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప రెండున్నరేళ్లలో రేవంత్ చేసిందేమీ లేదన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ సోదరులు భూ దోపిడీ చేస్తున్నారని.. మరో 50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.