HYD: హిమాయత్ నగర్లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక, పురావస్తు, బుద్ధవనం ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు.