SRD: కుల సంఘాలన్నింటికి సమాన హక్కులు కల్పించి వారి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మనూరు మండలం బాదల్గాంలో నూతనంగా బొంగుండేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే ప్రజల మధ్య ఐక్యత సోదర భావం పెంపొందుతుందన్నారు.