NGKL: తూడుకుర్తి ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకే పాఠశాల నుండి ఏకంగా 10 మంది విద్యార్థులు సీట్లు సాధించడంతో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.