MDCL: జనగణన 2027కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అల్వాల్ సర్కిల్లో ఈ నెల 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో, వెంకటాపురం కమ్యూనిటీ హాల్లో, లయోలా కాలేజ్ కమిటీ హాల్లో జరుగుతున్న ఈ శిక్షణలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు మాస్టర్ ట్రైనర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కైలాసపతి, జి. సత్యనారాయణ, డి.ఈ.ఈ పాల్గొన్నారు.