NLG: హైదరాబాద్లోని ప్రెస్ అకాడమీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని వీరేశం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరులకు శిక్షణా కార్యక్రమాలు విస్తరించాలని సూచించారు.