TG: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా, బీసీ మహిళలకు చట్టసభల్లో ఉప కోటా దక్కే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించబోదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పటికీ, అందులో బీసీ మహిళలకు ఉపకోటా లేకపోవడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా జాగృతి ఉద్యమిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.