KMR: భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు ఆధ్వర్యంలో పిల్లలకు అన్నప్రసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించడంతో పాటు విద్య ప్రారంభానికి శ్రీకారం చుట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వడ్ల స్వామి, అంగన్వాడీ టీచర్, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.