BHNG: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం భువనగిరి పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు.