SRPT: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డు సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.