JN: సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. డ్రైవర్లు కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి చూపు బాగుంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు.