SRCL: అంటరానితనాన్ని అస్పృశ్యతను రూపుమాపడానికి జ్యోతిబా ఫూలే చేసిన కృషి మరువలేనిదని కాంగ్రెస్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ముస్కాన్ పెట్లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.