WNP: అమరచింత మండలం మస్తిపురం జడ్పీహెచ్ఎస్, నందిమల్ల యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం వెంకటన్న మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. నందిమల్ల యూపీఎస్‌లో 7వ తరగతి చేర్పులపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు ప్రభాకర్, పాండు, రామన్ గౌడ్ పాల్గొన్నారు.