HNK: శాయంపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు.