BDK: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్-2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గ్రామాలు, పాఠశాలలు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.