బాలీవుడ్ నటి సారా అర్జున్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకుంది. ఆలయ సిబ్బంది ఆమెకు ఘనస్వాగతం పలకగా, సారా ప్రత్యేకంగా భస్మ హారతి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామివారి పిలుపు వల్లే ఇక్కడికి వచ్చానని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం సారా ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.