SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరికి పాల్పడ్డారు. దొంగలు కేవలం నగదును మాత్రమే కాకుండా ఏకంగా ఏటీఎం మిషన్ను వాహనంలో ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.