VKB: వికారాబాద్ మండల పరిధిలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లన్నీ కంకర తేలి అద్వానంగా తయారయ్యాయి. దీనివల్ల నిత్యం ప్రయాణించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.