AP: టీడీపీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. పూలే చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిరావు పూల్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.